*****మతం నీ విలువ ఏమిటి??నా దేవుడు--నా మతం గొప్ప అంటూ ********
ఓం వినాయకయ నమః
జీసస్ స్టే విత్ మీ--పార్డన్ మీ
అల్లాహో --అక్బర్
గీత--బైబల్--కురాన్ ల ను
చదువుకో
పాడుకో--
కానీ-- టీకా తా త పర్యాలతో
లేనివి-- ఉన్నట్లు కలిపించి--
నమ్మించకు--రుద్ధకు
దారి మళ్లించకు ?
దేశ భక్తి తరిగిపోయి
ధయ వ భక్తి పెరిగిపోతూ
నా దేవుడు--నా మతం
గొప్ప అంటూ
చిచ్చులు---జనాల మధ్య--దేశాల మధ్య
న్యూ యార్క్ లో గ్రౌండ్ జీరో సమీపంలో
మజిద్ నిర్మాణానికి
సమ్మెలు--చిక్కులు--తోసిపుచ్చడాలు??
అమెరికా పాస్టర్
కూ రా న్ ల ను తగలబెడుతానని
బెదిరింపులు---స్టేట్ మెంట్లు
ఎవరి మతం వారిధి
ఎవరి నమ్మకం వారిధి
కాలబెట్ట్ డా లు--వ్యతిరేకించ డా లు
ఎక్కడ ఉంధీ--సామాజిక న్యాయం--ప్రజాసామ్యం ????
మనిషి మనిషిని ఛంపుకునే మతాలు
మనిషిని పశువు గా మార్చే మజిద్ లు--మంధిరాలు--చర్చ్ లు
దేనికి ??? ఎంధుకు ???
బాబ్రి మజిద్ విధ్వసం
గుజరాత్ మారణ హోమం
ఇ జ్రా ఇల్--పాలస్తీనా లో
రోజు వారి జరుగుతున్న యుద్ధకాండ
ఇరాక్ లో-- ఉగాండ లో
సూ సైడ్ బాంబ్ లు
అన్నింటికీ మూల కారకులు
మత నాయకులు--మత గురువులు--మత ప్ర వ క్త లు
రాజకీయ నేతలు--దేశాల ఫా రీ న్ పాలిసీ లు
రాజకీయాల్లోకి
సాహిత్యం లోకి
పాటాశాల లోకి
మతాన్ని తీసుక రావడం
నిప్పుతో చెలగాటం వంటిధి
నా మతం--ఇతరుల మతం కన్నా
గొప్ప అంటూ
పిడి వాధాలకు
మ డి వాధాల కు---
తావులేకుండా ఉన్నపుడే
సుజలాం--సుపలాం-- సారె జహాసే అచ్ఛా
స్వామీజీ లు-- బాబా ల సందేశాలతో
జియ్యం గారి ఉపదేశాలతో
పొపు ఉపన్యాసాలతో
మహమద్ ప్రవక్త కబు ర్లా తో
ప్రపంచ శాంతి రాధు
యుద్ధాలు ఆగవు
దేశాలు సుసంపన్నం కావు
మన ఆలోచనల్లో
మార్పు రావాలి
మత ద్వేషాలు పోవాలి
పారాధర్షకత లేని రాజకీయ విదేశాంగ విధానాలు
లోప బూయిష్టమయనా న్యాయ శాస్త్రం
వారసత్వ -కుళ్ళు రాజకీయాల తో
రాజరికం చేస్తున్న ఘరానా దొంగలు
నేతలకు సాగీలుపాడే అధికార్ల కుళ్ళు వ్యవస్థ
ఉగ్రవా ధు ల ను తయారు చేస్తున్న అగ్రరాజ్యాలు
వీటి ప లీ తం
క మ్యు నిజం--ఫ్రాక్ష నిజం--టెర్రరిజం--
పుట్టుకలు
స్వామీజిలు--బాబా ల కా మ క లా పా లు
బిషప్స్ సెక్స్ స్కాండేల్స్
ప్ర వ క్త ల రాజా కియాలు
వీళ్ళు చెప్పేధి ఒకటి--చేస్తున్నధి మరొకటి
ఎంతకాలం వీళ్ళ గారే డి ఆట ను నమ్మడం ???
వినాయక చవతి లడ్డు 5 లాక్స్ కు వేలం
గాయిత్రి మంత్రం తో -ఆరోగ్యం కుదుట పడుతుంధాని
దుర్గ పూజా తో -- శక్తి పెరుగుతుంధాని
పెళ్ళికి--శోభనానికి గడియలు లెక్క పెట్ట్‌డం
అల్‌కయిధా నిర్మూలనకు
ఆఫ్గనిస్తాన్ లో అమెరికా జోక్యం
నిన్ను నీవు మార్చిపోయినపుడు
దేవుడి కి దగ్గర అవుతావు ??
మతాలు--- కొన్ని నమ్మకాలూ
సేను కోరికే పురుగుల్లా జనాల లోకి ??
మార్క్స్ అన్నట్లు---మతం నల్లమంధు లాంటిధి
మన ఆలోచనల్లో--ఆచరణ ల లో మార్పు రావాలి
ఈ వ్యవస్థ లో
మార్పు తేవాలి
అన్నింటికీ జవాబు మన లో ఉంధీ
రోమ్ లో కాధూ
మక్కా లో కాధూ
తిరుపతి లో కాధూ
అమృత్‌సర్ లో కాధూ--
మనిషి మనిషి ని
దేశం -ఇంకఒక దేశాన్ని
గౌ రవించుకోవాలి
మంచిని పెంచు
ప్రేమ ను పంచు
------------------------------------
బుచ్చి రెడ్డి