************ నా తెలంగాణ *************
జై తెలంగాణ జై జై తెలంగాణ
నా తెలంగాణ నా తెలంగాణ నరనరాలల్లోన నినదించు గాన
నా తెలంగాణ నా తెలంగాణ తనువెల్ల పులకించు నా యువతలోన
కర్పూరమైనారు వెలుగుల్ని పంచారు నివురు చీల్చే గాలి నిప్పుకణమైనారు
అధికార కాకీల అడ్డుకట్టైనారు అడుగు అడుగూ కలిపి ఉప్పెనై తరిమారు
నా తెలంగాణ నా తెలంగాణ నిత్యమై విరజిళ్ళు ఈ జగతిలోన
నా తెలంగాణ నా తెలంగాణ ఇక చాలు బలిదానం ఈ యువతలోన..
ఉదయించె రేపటికి ఊపిరై నిలవాలి ఉడుకు నెత్తురు తపన ప్రగతి పథమవ్వాలి
కటిక చీకటి చీల్చు కాగడై వెలగాలి తరతరాలకు మీరు ఆదర్శమవ్వాలి
నా తెలంగాణ నా తెలంగాణ విరచించు కవనమై కావ్యాల ధార
నా తెలంగాణ నా తెలంగాణ పాడి పంటలు, ఖనిజ, నదులు మాగాన
-------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి