************ ప్రకృతి ఘోష *************
నిప్పునమ్ముకున్నరు నీళ్ళనమ్ముకున్నరు
పంచభూతాళనే పాళ్ళువంచుకున్నరు
నిద్రపోతె నీ శరీరం నిలువునమ్ముకుంటరు
మేలుకో ఓ మనిషి మేలుకో
మేలుకో ఓ మనిషి ఏలుకో ఈ లోకాన్ని.......
నింగి నేల విషం జల్లి తప్పు జేస్తున్నరు
ముప్పు తెలిసి మూతి ముడిసి నీతి జెప్పుతున్నరు
పాడి పంట యంత్రాలకు ఫణం బెట్టుతున్నరు
పచ్చనైన ప్రకృతికే పాడు రంగులేస్తున్నరు
అడవి తల్లి సిలువలొలిచి అనుభవించుతున్నరు
అంధుడయ్యే పాపాలకు కారకుడౌతున్నడు
ఓ చోట వాన లేక ఎడారౌతున్నది
ఓ చోట వాన వరద ముంచుకొస్తున్నది
చెరువులన్ని నోళ్ళుతెరచి చావుదగ్గరైనవి
ఊరుకోక కరువు గుండె దరువులేస్తున్నది
ఊరు కేక ఉరుములై ఉప్పెనౌతున్నది
------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి