ఆత్మహత్య సృష్టికే విరుద్దం - అందె శ్రీధర్

************ ఆత్మహత్య సృష్టికే విరుద్దం *************

ఈ సృష్టిలో ఏ ప్రాణి ఆత్మహత్య చేసుకోదు......
మరి ఒక్క మనిషే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు..............?

మరణమంటే గెలిచిన జీవిత పోరాటం మరణమంటే మలచుకొన్న అమృతతత్వం
మరణం శాశ్వత మౌనం మరణం అంతిమ విజయం
మరణం ఒక త్యాగం..........

అనుకుంటే వచ్చేది కాదు ... వద్దంటే ఆగేది కాదు...

కొమ్మలకెందుకా పచ్చదనం ఎండా వానల్లో తడిసినందుకా
రెమ్మలకు పూవుల పుప్పొడులు ఎందులకు
ఎందుకు పళ్ళకా కమ్మదనం జీవిత సారాన్ని నింపిన నిండుదనమే...
ఫూత పూయాలి తేనెలూరాలి మొగ్గై పిందై కాయనిలవాలి
అనుభవ సారం రంగరించాలి పండై మనసును తీపి పంచాలి

కొమ్మ ఒక్కటి చివర తుంచితే చిగురు వేయదా మరలా మరలా...
చినుకు తడికి మోడు సైతం చిరునవ్వై చిగురువేయదా
నిన్ను ఓటమి కుంగదీస్తె నరనరాల సెగలు రేపి
ఆత్మహత్యలు వద్దు వద్దు.........
జీవితాన్ని సాధించు...............

-------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి

Posted Date:2014-03-19 13:10:34
comments powered by Disqus