|
************వేగం" " రోగం" "మాయం*************
పల్లవి: మనిషి వేగం మనసు వేగం మదిని తొలచే ఆశ వేగం
కాలవేగం జీవగమనం గతులుతప్పితె జగతి ప్రళయం
చరణం: మత్తు మందులొ యువత వేగం కాలుష్యం క్షిపణి వేగం
అణువు అణువు సమాచారం సాంకేతిక శాస్త్ర రాగం
మానవత్వం క్షేణ వేగం మనసు యంత్రం డబ్బురోగం
మనిషి మనిషికి సంబంధం మాయమయ్యే దాంపత్యం
సృష్తికే అందాలనిచ్చే సృంగారం భారమయ్యె
ఉద్యోగం నిశాచరమై సంసారం నిస్సారం
చరణం: ప్రాణ వాయువు పతన వేగం వ్యాధి ముంచే వరద వేగం
సంకరణం జన్యుమార్పుల వికృతాలె వింతరోగం (జన్యుమార్పు వికృత వేగం పాడి పంటల ప్రకృతి మాయం)
చేతికందే నీరు మాయం చేతాడు గిలక మాయం
నిండు చెరువుల తళుకు బెలుకులు ఇంకిపోయే పాతాళం
మట్టి వాసన మనసు మాయం తట్టి లేపే కూత మాయం
హళం మాయం పొలం మాయం రాక్షస యంత్రాలేలె రాజ్యం
(రాజకీయ నీతి మాయం రాక్షసత్వ రోత వేగం
పురిటి నొప్పికి మందు రోగం
లేగ దూడల గంతు మాయం
చేతి వృత్తుల చరక మాయం చేతాడు గిలక మాయం
మోట మాయం రాటు మాయం చేతాడు గిలక మాయం)
-------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి
|