విద్య వ్య(అ)వస్త - అందె శ్రీధర్

************"విద్య వ్య(అ)వస్త"*************

అక్షరానికి విషం పెట్టి లేత మొగ్గకు వాత పెట్టి
ఆట పాటలు పక్కన పెట్టి పుస్తకాల బరువునెత్తి
బాల్యాన్ని ఫణంపెట్టి పరుగు పందెం పోటిపెట్టి
అరువు దెచ్చిన ఈ క్షరాలు బుర్రలోన నింపుతుంటె
జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగ మారుతుంటె
అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి ఏమనాలి.....

జీవితాలను రంగరించి ధైర్యమిచ్చే కధలులేవు
గుణగణాల ఊసులేదు దాన ధర్మం నీతిలేదు
హాస్య కథలు అసలులేవు బ్రతుకు నేర్పె దారిలేదు
గురు శిశ్యుల మాట లేదు మంచి మాటలు చెప్పలేరు
పుస్తకాల బట్టి పెట్టి చూచిరాతలు రాయించి
రాని మార్కులు వేయించి ర్యాంకు నీదని నమ్మించి
పరీక్షంటు పోటి పెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే
మనసు అలజడి పెంచుకుంటూ మనిషి మరలా మారకుంటె
ఆత్మ హత్యలు చేసుకోక ఏమవ్వాలి ఏమవ్వాలి....

-------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి

Posted Date:2014-03-19 13:13:03
comments powered by Disqus