"తెలంగాణ ఉదయ రాగం"
ఉదయ రాగం స్వాగతిస్తుంది
మా ఊరులెమ్మని కూతవేస్తుంది
ఆవుపాలకు లేగ చూస్తుంటె
పాలు పితికిన సవ్వడౌతుంది
గాలి సవ్వడి ఈళ వేస్తుంటే
పక్షి గూళ్ళు విడిచి వెళుతుంటె
మబ్బు చాటు చినుకు చూస్తుంటే
మంచు ముత్యం కులుకుతూఉంటె
చినుకు చినుకు చిలకరించి
చిలిపి నవ్వుతొ పలకరించి
చినుకు తడికి చిందులేస్తుంది.....
బ్రతుకు ఆటకు సిద్దమౌతుంది
మట్టి వాసన పరిమళించి
మనసు మురిసి పులకరించి
గతం నాకు గుర్తు చేసి
ఆట పాటై ప్రాణమిస్తూ
తీపి గుర్తై తొంగిచూసి
పసిడి కాంతుల గమ్యమౌతూ
పల్లె పడుచై తుళ్ళిపోతుంటె....
ప్రాణమంతా పండగౌతుంది.
పాట పల్లవి పరుగుతీస్తూ
పచ్చని తీవాచి వేస్తె
పరుగు పరుగున నిన్ను చేర
ప్రతీ పాదం పరవశిస్తుంది
నాట్య భంగిమ నడకనేర్పి
కళ్ళలో కాంతుల్ని నింపి
నర నరాలా పరుగు తీస్తుంటే
నన్ను నేనే మరచిపోతున్న
పరిచయాలు అనుభవాలు
తీపి మాటల తెలంగాణ
పరివిధాలా ప్రణయమౌతుంటే.....
పూల హారం మనసుకేస్తుంది.