" అవినీతి రహిత తెలంగాణాని సృష్టించుకోవాలి " - అందె శ్రీధర్

************" అవినీతి రహిత తెలంగాణాని సృష్టించుకోవాలి"*************

ఎప్పుడంతం ఎప్పుడంతం ఏరులై ఎగపాకు లంచం 
విద్యాబుద్దుల బడికి లంఛం 
పురిటినొప్పికి వైద్య లంచం 
ఓటు వేస్తే నోటు లంచం 
ఓలాలాడే మత్తు లంచం 
సీటు కోసం కోటి లంచం 
మంత్రి పదవికి మొక్కు లంచం 
అటెండరుకు చాయి లంచం 
అప్పు అడిగితె బ్యాంకు లంచం 
తీర్చకుంటే చిప్ప లంచం 
 
"ధనం మూలం ఇదం జగత్" అనేది నేడు ధనమే మూలమ్ ఇదం జగత్ అయ్యింది మనం చదువుకునే చదువులు, జ్ఞానం అన్ని కూడా 
డబ్బు సంపాదించడమే పరమోధర్మం గా పరిణమించినవి. మనిషి సృష్టించిన డబ్బు, మనిషిని ఆడించే స్తాయికి చేరింది. మనిషి విజయానికి 
ప్రామానికంగా మారింది(మార్చిండు), చివరకు డబ్బుకు దాసోహం అయినాడు మనిషి. డబ్బు మనిషికి ప్రధానమే కాని డబ్బు మాత్రమే ప్రధానము 
కాదు.

-----------------------------------
అందె శ్రీధర్ రెడ్డి

Posted Date:2014-03-19 13:17:36
comments powered by Disqus