గుండెకోత ---సతీష్ కుమార్ ,బొట్ల

గుండెకోత
60 ఏండ్ల పోరాటగ్ని మల్ల అంటుకుంది
ఆంధ్ర తెలుగు తెల్లోని పాలనా పతనం పరంబమైంది
అడ్డు , అప్పు లేకుండా దోసుకుంటున్న
ఆంధ్ర ద్వంద నీతికి అంతం అరంబమైంది
బెల్లం మిద ఈగలోలె
చెట్టుమీద కాకులోలె
చేనులో దిష్టి బొమ్మలోలె
ఇంక్కేన్నాలు మామీద మీ పెత్తనం

పెద్దమనుషుల ఒప్పందం తో పొత్తుఅంటిరి
పాపమని పంచన జేర్చుకుంటే
పందికోక్కులోలె మా పదలకిందే పొక్కలు జేస్త్రి
దోస్థానం పేరుజెప్పి మముల్ని దోసుకోబడితిరి
ఐన మనోల్లెగదా అని మేమురుకుంటే
ముల్కీ నిబంధనలను మూసేసి
మమ్ముల్ని నట్టేట ముంచుత్రి
ఐన సహించి అక్కున జేర్సుకుంటే
అటుకేక్కి గబ్బిలలోలె అతుక్కపోతిరి
నిలువనీడ లేదని సూరుకిన్ధికి పిల్తే
సుసినదిఅంత కావాలనవాడితిరి
నీడనిచ్చిన చెట్టుకే చీడ పురుగు లోలె
చెదలు పట్టియబడితిరి
ఇడిసిపెట్టి పోరా అంటే
ఇలకంత మాదే అనవడితిరి
ఏమ్ముంది మీది ఇక్కడ
ఆస్తులన్నీ మయీ
అధికారం మీదా

54 ఏండ్ల మీ అధికారపు పాలనలో
మా ఆస్తులన్నీ అమ్ముకుంటిరి
అరకొర నిధులు మాకు అంటగట్టవాడితిరి
అన్నింటా మాకు కోతలుపెట్టబడితిరి
చదువుల్లో కోత
కొలువుల్లో కోత
నిళ్ళలో కోత
నిధుల్లో కోత
ఇన్నికోతలతో ఎలా తీరేది
నా తెలంగాణ గుండెకోత
అందుకే ఆరంబంఐంది
అస్తమించని అవిరామ పోరాటం
ఇగ పంపకాలు జరుగుడే
లేకుంటే మీ అంపకాలు చేసుడే
అప్పటివరకు ఈ పోరు
పోడిసేటి పొద్దోలె సాగుతూనే ఉంటుంది

జై తెలంగాణ జై జై తెలంగాణ

రచన
సతీష్ కుమార్ ,బొట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614
botla1987.mygoal@gmail.com

Posted Date:2014-03-19 13:22:33
comments powered by Disqus