వీడ్కోలు ......వీడ్కోలు..... - Srikanth Pusala

 

వీడ్కోలు ......వీడ్కోలు....

మరలిపో తరలిపో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమా

తల్లి తెలంగాణ నేడు కదం తొక్కే చూడుమా
ఇంకను సుత నీతోనే కలిసి ఉండి మిత్రమా
మతిలేని పౌరునిగా నే మిగులుడు నీకిష్టమా!
సెలువు నీకు సెలువు నీకు ఆంధ్ర రాష్ట్ర సోదరా

ప్రజాస్వామ్య డిమాండ్ నేడు ముందుకొచ్చే చూడురా

ఇంకను సుత ఆలుమొగల బంధమంటే నువ్వు రా
నిరాశ తో నిస్పృహ తో క్రుంగి పోయేది నేను రా!

వీడ్కోలు వీడ్కోలు స్వార్థానికి వీడ్కోలు
సమాజాన్ని రోడ్డు కీడ్చి నవ్వుతున్న ముఖాలు
ఇంకను సుత మీతోటే కలసి ఉంటె తోర్రన
సిగ్గుమాలిన జన్మ నాదని నేను నిరుపించనా!
జాతీయత ధరణిలోన అనువనువున వుండిన
భారతీయత మనలోన అడుగడుగునా నిలువదా
రాష్ట్రాలుగా విడిపోవుట మంచిదని చాటర
మింగుడుపడని విషయమైన మింగాక ఇక తప్పదురా

 

వీడ్కోలు వీడ్కోలు ముసలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమా
స్వాగతము తెలంగాణ రాష్ట్ర అవిర్భావమా
వీడ్కోలు వీడ్కోలు దశబ్దాల చరితమా
స్వాగతము స్వాగతము నూతన అధ్యయమా

స్వాగతము స్వాగతము తెలంగాణ రాష్ట్ర అవిర్భావమా
దేశానికి మరో పుటను జతగా చేర్చి తిరిగి ఎగురు త్రివర్ణమా

స్వాగతము స్వాగతము తెలంగాణ రాష్ట్రమా
స్వాగతము స్వాగతము స్వాగతము స్వాగతము!!!!!

Posted Date:2014-03-19 13:29:29
comments powered by Disqus