ప్రవాసి తెలంగాణా దివస్-2010

జై తెలంగాణా,

ప్రియమైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు,

తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం - ఇండియా డిసెంబర్ 19 వ రోజున "ప్రవాసి తెలంగాణా దివస్-2010 " ఒక రోజు కార్యక్రమము క్రింది చిరునామా లో జరపదలిచినాము.

"ప్రవాసి తెలంగాణా దివస్-2010 "
టాగూర్ ఆడిటోరియం ,
ఉస్మానియా యునివర్సిటీ, హైదరాబాద్ .
ఇందు మూలంగా వివిధ దేశాలనుండి(అమెరిక, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్, కెనడా ) తెలంగాణా అభిమానులు, శ్రేయోభిలాషులు పల్గోనుచున్నారు.
గతంలో మేము ఈ ప్రస్తావనను వారి ముందు ఉంచగా ఆయా దేశాలలో ఉన్నటువంటి మిత్రులందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళలో కొందరు ఫోన్/ఈమైల్స్ ద్వారా ప్రవాసి తెలంగాణా దివస్-2010 జరపతలపెట్టినందుకు సంతోషిస్తూ, మరికొందరు ప్రత్యక్షంగా పాల్గొని విజయవంతం చేస్తామని వ్యక్తం చేసినారు.

కార్యక్రమము యొక్క విధి విధానాలు మీకు త్వరలో తెలియజేయగలము

కావున కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తూ ....

జై తెలంగాణా,
జై జై తెలంగాణా,
తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం -ఇండియా
తార్నాక, హైదరాబాద్
తెలంగాణా రాష్ట్రం
భారత దేశం

Posted Date:2014-03-19 13:36:08
comments powered by Disqus