బిగిసిన ఓ పిడికిలయ్యి
ఎగసిన ఓ ఉప్పెన్నయ్యి
అభ్యుదయం పల్లవించే
గేయమయ్యే తెలంగాణ ||2||
ఊరు ఊరు వాడ వాడ
ఇంటి ఇంటి గడప కాడ
నినాదాల స్వరాలతో
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||
గుండె పగిలి కడుపు కాలి
నెత్తుటి కన్నీళ్లు రాలి
సముద్రమై పొంగుతున్న
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||
అరిచి అరిచి ఏండ్లు గడ్చి
హక్కులకై కలిసి వచ్చి
గొంతులన్ని పాడుకునే
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||
శ్రమజీవుల పనిముట్లై
నవయువకుల పిడికిల్లై
పల్లెటూర్ల పంటలయ్యి
రైతుకడుపు మంటలయ్యి
మైసమ్మ గుడి గంటలయ్యి
పసి పిల్లల్ల జోలలయ్యి
ఆదివాసుల రేలలయ్యి
దేశమంతా మారుమోగే
గేయమయ్యే తెలంగాణ || బిగిసిన || ||2||
- సిద్దార్థ పాములపర్తి
Posted Date:2014-03-19 14:09:21