చారిత్రక కొలమానం
లేని మీ (ఆంధ్ర) గొప్పతనాన్ని చెప్పుకునేందుకు
మా గతం గొంతు నలిపెస్తిరి
మీ ఉనికిని చాటుకునేందుకు
మా ఉద్బవాన్ని పుడిచేస్తిరి
మీ అస్తిత్వం నిలుపుకునేందుకు
మా చరిత్రను అనగాద్రోక్కితిరి
మీ అహంభావం తో అధ పాతాళానికి
తొక్కబడిన మా మహోన్నత చరిత్ర
ఆత్మగౌరవంతో మహా భూకంపమై
మట్టి క్రింది నుండి మహా చరిత్రగా
బయటకోస్తూనేఉంది
అల వచ్చిన ప్రతిసారి
మీ అబద్ధాని అబద్ధం కాకుండా చేసేందుకు
మా చరిత్రను ములకు నెట్టాయబడితిరి
కాదంటారా కానిదే
తోలి తెలుగు రాజధాని
తెలంగి శాతవాహనుల పుట్టినిల్లు
కోటిలింగాల(కరీంనగర్ జిల్లా )
చరిత్ర ఎందుకు అచ్చు కావటం లేదు
దక్షణ భారత దేశం లోని మధ్య యుగపు దేవాలయాల్లో
మహోన్నత మైనదిగా పేరొందిన మా
కాకతీయుల కళ కాండం రామప్ప కు
ఎందుకు ప్రాచుర్యం కలిపించాటంలేదు
బౌద్ధమతానికే పుట్టినిల్లుగా పేరొందిన
విజయపురి(నాగార్జునకొండ) కి
ఎందుకు ప్రాధాన్యత దక్కడం లేదు
ఈల ఎన్నో చారిత్రక నిజాలను నలిపెస్తున్నారు
ఎందుకంటే
మా చరిత్ర అచ్చు ఐతే మీ చరిత్ర
పుచ్చుపట్టి పోతుందని మీ బయం
మీ అబద్ధం అబద్ధం గా
నిరుపితమవుతుందని మీ బాధ
అందుకే మా చరిత్రను అనగాద్రోక్కుతున్నారు
ఐన
మీరు అంగ ద్రొక్కిన ప్రతిసారి
మా చరిత్ర మట్టిని చీల్చుకుంటూ
మహోజ్వలంగా బయటకోస్తూనే ఉంటుంది
అల వచ్చిన ప్రతిసారి
ఏమిలేని మీ చరిత్రను వెతుకోనేందుకు
అర్ధంలేని మీ అస్తిత్వాని
అబద్ద ప్రచారం చేసుకొనేందుకు
మళ్ళి మా చరిత్రే
మీకు కొలమానం అవుతుంది
అవుతూనే ఉంటుంది .
జై తెలంగాణ జై జై తెలంగాణ
రచన
సతీష్ కుమార్ .బొట్ల (తెలంగాణ సతీష్)
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614.