**ఆగదు నా తెలంగాణ పోరు *****
అణువణువునా అనిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం…
ఆపగలను అన్నోడికి నా సవాల్…