|
"మరుగుతున్న మనసు"
ఏమౌతుందో గమ్యమేటుపోతుందో
ఎవరున్నారు నీకు ఏమౌతారు
అడుగు అడుగులో నిప్పుల సెగలున్నాయి
పడగ విప్పి విషనాగులు కాచుకున్నవి
లేత గుండెనే పిడుగులు చీల్చుతున్నవి
పగటి పూటనే చీకటి కమ్ముకున్నది
ముళ్ళ పొదలలో మనసు చిక్కుకున్నది
తెల్లారే పొద్దు కొరకు వెదుకుతున్నది
"ఏమౌతుందో.."
Ande Sridhar
|