తిన్నదరగక ఆమరణ దీక్ష..శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి

 

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి తిన్నది అరగక పైత్యం అయినుండే...
ఎవడో పసరు మందు ఇచ్చిండంట...
వారం పది దినాలు పస్తులు ఉండమన్న డoట...
ఎట్లాగు ఏమి తినకూడదు, తాగ కూడదు కదా అని
అన్నిటిలో లాభం చూసే మన నాయకునికి 
ఒక ఆలోచన వచ్చిందంట
కాంగ్రేస్సోల్లు మంత్రి రాజీనామా తీసుకున్నరు
రావాల్సిన ప్రాజెక్ట్లు చేతికి రాకుండా పోయినయి
తెలంగాణాల జనం దుమ్మెత్తి పోస్తున్నరు
ఊర్లకు ఉత్త మొఖం తో పోతే 
కాండ్రించి ఉమ్మేస్తారని
ఆమరణ నిరాహార దీక్ష అని పేరు పెట్టి 
స్టేజి డ్రామాకు తెర లేపిండు...
బాగా ఆడింది... 
అక్కరకు రాణి సుట్టాలు కూడా వచ్చి 
పలకరించి పోయిండ్రు...
ఆమరణం అనే పదానికి 
ఆంద్ర సర్కార్ ఎమన్నా అర్థం మార్చేసింద..?
లేక భూటకాలలో ఇదొక కొత్త భూటక నాటకమా..?
తొంబై ఆరేండ్ల ముస్సలోడు
ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత కూడా 
తోనికీసలాడకుండా... అనర్గళంగా 
ఆర్భాటంగా... అవతలోల్ల మీద
అగ్గి మీద గుగ్గిలం లాగ మండి పడ్తుండు
మరి మన వెంకన్నకు...
అనారోగ్యం... 
ఆపసోపాలు...
అప్పటికీ "కేంద్రం దిగి వచ్చే దాక ఆమరణ దీక్ష విరమించ"
అని ప్రగల్బాలు...
మరి ఇయ్యాల కేంద్రం దిగి వచ్చిందా..? లేక
నల్లగొండ జిల్ల లోని నాగార్జున కొండను 
ఇడుపులాపాయ లాగ చేసుకోమని రాసిచ్చింద..?
లంగరేసిన అనామక ప్రాజెక్టులకు అనుమతులిచ్చిందా..?
ఏంది..? నీ దీక్ష విరమణకు కారణం ఏంది...
ఆనాడు కెసిఆర్ విరమిస్తే శవాల మీద రాజకీయం... నాటకం... భూటకం అని 
మోచెయ్యి దూరంల ఆకశం అందేటంత ఎత్తుకు ఎగిరి మరీ 
ఎకదాటిన ప్రసంగాలిచ్చినావ్...
ఆయన దీక్షకు కనీసం ఒక ప్రకటన చేసిండ్రు... 
నిలబెట్టుకోక పోయినా... జనానికి ఒక ఆసరా దొరికింది...
మరి నీ దీక్ష వల్ల ఎవనికి ఏమి ఒరిగింది..?
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి 

Posted Date:2014-03-19 14:31:14
comments powered by Disqus