317 జీవో ద్వారా బదిలీ అయిన స్థానిక ఉపాధ్యాయులను వెనుకకు తీసుకురావాలి: కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్

మరోమారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కు అవకాశం కల్పించాలి..పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్దన్ యాదవ్

యాచారం: పీఆర్టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు వారోత్సవాల సందర్భంగా    జడ్పీహెచ్ఎస్ గున్ గల్, మోడల్ స్కూల్, కేజీబీవీ యాచారం, జెడ్పీహెచ్ఎస్ యాచారం, జడ్పీహెచ్ఎస్ చింతపట్ల, జడ్పీహెచ్ఎస్ నల్లవెల్లి. జడ్పీహెచ్ఎస్ మాల్, జడ్పీహెచ్ఎస్ నందివనపర్తి, జడ్పీహెచ్ఎస్ చింతుల్లలో జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్యగారి గోవర్ధన్ యాదవ్ గారు 2023 సభ్యత్వ నమోదు వారోత్సవాలు ప్రారంభించారు.

à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. వర్క్ అడ్జస్ట్మెంట్లు ఆపి à°°à±‡à°·à°¨à°²à±ˆà°œà±‡à°·à°¨à± చేసి బదిలీలు, పదోన్నతులు
చేపట్టాలన్నారు. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఆగస్టు 15 లోపు చెల్లించాలని, లేనిపక్షంలో  పోరుబాటకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2002, 2003 సిపిఎస్ ఉపాధ్యాయులకు ఓపిఎస్ సాధిస్తామని తెలిపారు. à°ˆ హెచ్ ఎస్ కార్డు అన్ని ఆస్పత్రులలో పటిష్టంగా అమలయ్యేలా కృషి చేస్తామన్నారు.

పీఈటీ పండిట్ పోస్టులు అప్ గ్రేడేషన్, బదిలీలు ప్రమోషన్స్, 317 జీవో ద్వారా ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయుల  సమస్యలను సాధిస్తామని తెలియజేశారు. రానున్న శాసనసభ ఎన్నికల కన్నా ముందే పైన సమస్యలు ప్రభుత్వం  పరిష్కరించకపోతే ప్రభుత్వంతో పోరాడి ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతామన్నారు. à°ˆ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మహేష్ యాదవ్, గౌరవ అధ్యక్షులు భోజయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరి,  రాష్ట్ర బాధ్యులు సురేష్, యాదయ్య, వెంకటయ్య, రమేష్ పాల్గొన్నారు.

Previous article